దేవునియందు భయభక్తులు కలిగియుండుట


దేవుని యొక్క  సందేశములు 

1.అంశము :  దేవునియందు  భయభక్తులు కలిగియుండుట 

ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్దామిదే దేవునియందు  భయభక్తులు   కలిగియుండి ఆయన  కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి  ఇదియే విధి : ప్రసంగి:12 :13    
దేవునియందు భయభక్తులు కాలిగి జీవించటం వలన  మనకు దేవుడు ఇచ్చు ఆశీర్వదములను గురుంచి  కొన్ని విషయాలు మీతో పంచుకొనుటకు ఇష్టపడుతున్నాను .

మెదటి ఆశీర్వాదం.
  1    ఆశీర్వదించును
      "కీర్తనలు 115:13 –  13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల  వారిని యెహోవా ఆశీర్వదించును."
      దేవునియందు భయభక్తులు  కలిగిన చిన్నలేమి, పెద్దలేమి, అందరినీ    దేవుడు ఆశీర్వదించును ,  
        ఉదాహరణకు  —అబ్రహామును దేవుడు ఆశిర్వదించుట ఆది :24: 1 అబ్రాహాము బహు కాలము గడిచిన   వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రా హామును ఆశీర్వదించెను. ,35, ,,22:12.)
  2.   రక్షించును.
         " కీర్తనలు 34:7..  7 యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని    
          రక్షించును"
    – దేవునియందు భయభక్తులు  కలిగినవారిని దేవుడు రక్షించును.
 (ఉదాహరణకు  – దానియేలు :౩:17,28.  28 ​నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు  పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నా శ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి  షేద్రకు, మేషకు అబెద్నాగో . అను వారిని దేవుడు అగ్నిగుండములో నుండి  రక్షించెను .
మనము దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తే,  దేవుడు మనలనుకుడా  తన చిత్తనుసరముగా  తప్పక రక్షించును .

౩. మేలులుచేయును 


Ps 31:19 నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి  యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట     
                నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు  సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.


Gen 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.


Gen 32:12 నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

దేవుడు యాకోబుకు మేలులు దయచేసిన విదంగా మనకు కూడా మేలులు చేయును  కనుక మనము దేవునియందు భయభక్తులు కలిగి జివించవలెను.

4 .దేవుడు జాలిపడును, కృపచుపును


Ps 103:13 తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల  జాలిపడును.

Ps 103:17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస  రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
Ps 103:18 ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.

దేవునియందు భయభక్తులు కలిగి జీవించుట వలన ఆయన కృప మరియు  జాలి మనమీద
 ఉండును .
 5. దీర్ఘాయువునకు కారణము 


Pro 10:27  యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట  దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును. 


Pro 14:27  అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు  ఊట అది మరణపాశములలోనుండి విడిపించును 

 దేవునియందు  భయభక్తులు కలిగినవారు చేయవలసిన పనులను గురుంచి తెలుసుకుందాం .


1 .Ecc 12:13  ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. 

1.దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను 

ఉదాహరణకు : కొర్నేలీ

 Act 10:2  అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు. 
26 ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన  యెడల వాని భక్తి వ్యర్థమే. 27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.


2 .Pro 16:6  కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు
2 .చెడుతనమునుండి  తొలగిపోవలెను 
    ఉదాహరణకు :యోబు 
Job 1:1 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.


Ps 97:10 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.


....(.ఇంకా ఉంది ...............)

అంశము 2----మీరు లోకసంబందులు కారు !

అంశము-2  మీరు లోకసంబందులు  కారు !
  
John 17:16 నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.

దేవుడు మనలను లోకములోనుండి  ఏర్పరచుకున్నాడు!John 15:19 మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును  లోకములోనుండి  ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.
ఎందుకు దేవుడు మనలను లోకములోనుండి  
ఏర్పరచుకున్నాడు?

ఎందుకనగా  


 కారణం 1
2. ఈ లోకపు నటన గతించుచున్నది.
1Cor 7:31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.

 1John 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్త మును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

 ఈ లోకపు నటన గతించుచున్నది కనుక మనము లోకముతో పటు  నశించుట దేవునికి ఇష్టము లేదు.కనుక  మనలను  


ఏర్పరచుకున్నాడు. ఈ లోఖనికి ఆయనే  వచ్చి  మనలను రక్షించినాడు (
John 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను).


 కారణం 2
1. మనము దేవుని  కొరకు  ఫలించుటకు మనలను ఎన్నుకున్నాడు.
                                                


John 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.దేవుడు లోకములోనుండి  వేరు చేసినతరువాత  మన స్తితి ఏమిటి ?

(ఇంకా ఉంది )

JESUS MOVE

The Jesus Film Project app is a full digital library of more than 200 full-length movies, miniseries, and short films produced to help the world know Jesus better. Everything on the app is free to watch, download, and share with anyone you meet, wherever you meet them.:

example graphic

The Jesus Film Project app is a full digital library of more than 200 full-length movies, miniseries, and short films produced to help the world know Jesus better. Everything on the app is free to watch, download, and share with anyone you meet, wherever you meet them.

example graphic example graphic

The Jesus Film Project app is a full digital library of more than 200 full-length movies, miniseries, and short films produced to help the world know Jesus better. Everything on the app is free to watch, download, and share with anyone you meet, wherever you meet them.

MINISTRIES

MAHABUBNAGAR, TELANGANA:

MINISTRIESDescription
MINISTRIESJESSU MOVE
MINISTRIESCHURCH PLANTING MOVEMENT
MINISTRIESYR2020
MINISTRIESCPMI AND BCCI

PRAYER REQUEST

Form field example

Textarea example

Checkbox example

Dropdown list example